Sreemukhi: క్రేజీ అంకుల్స్‌.. టైటిల్‌ సాంగ్‌తో ఊపేస్తున్న శ్రీముఖి - Sreemukhi Crazy Uncles Title Song Lyrical Video
close
Published : 25/07/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sreemukhi: క్రేజీ అంకుల్స్‌.. టైటిల్‌ సాంగ్‌తో ఊపేస్తున్న శ్రీముఖి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా.. తొలిసారిగా ప్రధానపాత్రలో కనిపించి సందడి చేయనుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రేజీ అంకుల్స్‌’లో ఆమె లీడ్‌ రోల్‌ పోషించింది. ఈ చిత్రంలో క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి కనిపించనున్నారు. కాగా.. సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ను ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఆదివారం విడుదల చేశారు. ఈ పాట కుర్రకారుకు బాగా ఆకట్టుకునేలా ఉంది. డిస్కోలో జరుగుతున్న పార్టీలో డ్యాన్స్‌ చేస్తున్న శ్రీముఖి.. ఆమెను ఇంప్రెస్‌ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్న అంకుల్స్‌.. ఈ పాటలో చూపించారు. 

మధ్య వయస్కులైన ముగ్గురు వ్యక్తులు.. 20ల్లో చేయలేకపోయిన చిలిపి పనులను మళ్లీ చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఓ అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది. వారు తమ కోరికలు నెరవేర్చుకోగలిగారా..? శ్రీముఖి వాళ్లకు ఎలా సహాయం చేయగలిగింది.. అనేదే కథ. ఈ చిత్రాన్ని గుడ్ సినిమా బ్యానర్‌పై కిరణ్ తలశిల సమర్పణలో బొడ్డు అశోక్ నిర్మించారు. పోసాని కృష్ణ మురళీ, రఘు, హేమా, గాయత్రి భార్గవి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందించారు. ఈ ఏడాది ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత శ్రేయాస్‌ శ్రీనివాస్‌ అన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని