రోజా నా ముందు ఉండటమే అదృష్టం: శేఖర్‌ మాస్టర్‌ - Sri Kanaka Mahalakshmi Lucky Draw All Promos RoundUp
close
Published : 15/11/2020 03:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోజా నా ముందు ఉండటమే అదృష్టం: శేఖర్‌ మాస్టర్‌

హైదరాబాద్‌: ‘నటి రోజాగారు నా ముందు ఉండడమే నా అదృష్టం’ అని అంటున్నారు ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌‌. దివ్వెల పండుగ దీపావళిని పురస్కరించుకుని  ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ‘ఈటీవీ’లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ పేరుతో అలరించనున్న ఈ ప్రోగ్రామ్‌లో శేఖర్‌ మాస్టర్‌, రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కార్యక్రమంలో భాగంగా.. ‘లాటరీ అంటే అదృష్టానికి సంబంధించింది కదా.. మరి మీ దృష్టిలో అదృష్టం అంటే ఏమిటి?’ అని శ్రీముఖి.. శేఖర్‌ మాస్టర్‌ను ప్రశ్నించగా.. ‘రోజా గారు నా ముందు ఉండడమే నా అదృష్టం’ అని సమాధానమిస్తారు. శేఖర్‌ మాస్టర్‌ ఇచ్చిన సమాధానంతో అక్కడే ఉన్న హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌ సరదా పంచులతో కడుపుబ్బా నవ్వించనున్నారు.

లక్కీడ్రాలో గెలుపొందిన సెలబ్రిటీలకు కారు, విల్లా, కేజీ బంగారం, పది లక్షల నగదు.. బహుమతులుగా అందించనున్నారు. దీంతో ఈ లాటరీలో పలువురు జబర్దస్త్‌ కమెడియన్లు, సోషల్‌మీడియా తారలు పాల్గొననున్నారు. అయితే ఈవెంట్‌లో పాల్గొన్నవారికి మాత్రమే కాకుండా  కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకు సైతం బహుమతులు గెలుపొందే అవకాశం కల్పించనున్నారు.

ఈవెంట్‌లో భాగంగా అనూప్‌రూబెన్స్‌ తన బృందంతో కలిసి మెలోడిస్‌తో మెస్మరైజ్‌ చేయనున్నారు. అనూప్‌ రూబెన్స్‌ కుమారులు సైతం.. ‘దేశం మనదే తేజం మనదే’ అంటూ స్టేజ్‌పై మెరుపులు మెరిపించనున్నారు. మరోవైపు రాకెట్‌ రాఘవ కుమారుడు తన ముద్దు ముద్దు పంచులతో రాకెట్‌లా దూసుకెళ్లనున్నాడు. ‘ఉట్టిమీద కూడు’ అంటూ శేఖర్‌ మాస్టర్‌, రోజా కలిసి వేసిన స్టెప్పులు షోకే హైలెట్‌గా మారనున్నాయి.

‘రియల్‌ హీరో’ సోనూసూద్‌.. సాయం పొందిన ఎంతో మంది ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’లో పాల్గొని తమ గాధలను పంచుకోనున్నారు. సరదా పంచులు.. ‘జబర్దస్త్‌’ స్కిటులు.. గ్రేస్‌ఫుల్‌ డ్యాన్స్‌లు.. చూడాలనుకుంటే దీపావళి పండుగ రోజు ఉదయం 9 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ చూడాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని