ఇప్పటికీ బతకాలనే ఆశ ఉంది..! - Sri Kanaka Mahalakshmi Lucky Draw Spl Promo
close
Published : 12/11/2020 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పటికీ బతకాలనే ఆశ ఉంది..!

ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేస్తున్న వీడియో

హైదరాబాద్‌: గుండె సంబంధిత సమస్యతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తి.. నటుడు సోనూసూద్‌ సాయంతో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆ వ్యక్తి ఓ కార్యక్రమంలో పాల్గొని తన ఆరోగ్య సమస్య గురించి, సోనూసూద్‌ తనకి చేసిన సాయం వివరాలు తెలియజేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ పేరుతో ఓ స్పెషల్‌ ఈవెంట్‌ ప్రసారం కానుంది.

‘జబర్దస్త్‌’ కమెడియన్ల సరదా స్కిట్లు, శేఖర్‌ మాస్టర్‌ రోజా గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులతో ఈ ఈవెంట్‌ ప్రేక్షకులకు వినోదం‌ అందించనుంది. ఈవెంట్‌లో భాగంగా ‘రియల్‌ హీరో’ సోనూసూద్‌ నుంచి సాయం పొందిన ఎంతో మంది ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ స్టేజ్‌పై సందడి చేయనున్నారు. అంతేకాకుండా తమ కన్నీటి గాథలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. ఈ స్పెషల్‌ ఈవెంట్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రోమో ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

‘నాపేరు మల్లికార్జున్‌. ఓసారి నాకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. గుండెకు సపోర్ట్‌ చేసే ఎముక పూర్తిగా దెబ్బతింది. ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అని వైద్యులు చెప్పారు. కానీ, నాకు మాత్రం బతకాలనే ఆశ ఉంది. చికిత్సలో భాగంగా కరెంట్‌ షాక్‌ ఇస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నా. వైద్యం కోసం నా కుటుంబం ఎంతో ఇబ్బందిపడుతుంది. కుటుంబానికి భారం కాకూడదనుకున్నా. నేను లేకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లైనా జీవిస్తారని నిర్ణయించుకున్నా. అలాంటి సమయంలో నా గురించి తెలుసుకున్న సోనూసూద్‌ సర్‌.. సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ‘వైద్యానికి అయ్యే ఖర్చు గురించి నువ్వు మర్చిపో. నేను చెప్పిన ఆస్పత్రులకు వెళ్లు. నీ పిల్లలు పెద్దవాళ్లు అయ్యేవరకూ నువ్వు బతికే ఉంటావు. మనస్పూర్తిగా ఈ మాట చెబుతున్నా’ అన్నారు’ అని సదరు బాధితుడు చెప్పిన మాటలతో తాజా ప్రోమో విడుదలయ్యింది. అయితే, మల్లికార్జున్‌ కన్నీటి గాథ విని ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి గురి అవుతున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని