అందుకే దిల్లీలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ మరణాలు - Stubble burning led to high COVID death rate in Delhi
close
Published : 23/11/2020 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే దిల్లీలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ మరణాలు

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండగా మరణాల రేటు కూడా అదే స్థాయిలో ఉంది. గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు 100కి పైగా మరణాలు సంభవించాయి. అయితే దీనికి కారణం పంట వ్యర్థాల దహనం వల్ల ఏర్పడిన కాలుష్యమే అంటున్నారు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌. కొవిడ్‌ 19 బాధితులు ఈ కాలుష్య పొగను పీల్చడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందన్నారు. 

దేశ రాజధానిలో కొవిడ్‌ పరిస్థితులపై సత్యేంద్ర జైన్‌ మీడియాతో మాట్లాడారు. ‘పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో దిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి పడిపోయింది. దీంతో కొవిడ్‌ బాధితులపై ఇది రెట్టింపు ప్రభావం చూపిస్తోంది. సాధారణంగానే కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక కొవిడ్‌ బాధితులు ఈ కాలుష్యపు పొగను పీల్చడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. అందువల్లే గత కొన్ని రోజులుగా దిల్లీలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టింది. వచ్చే రెండు మూడు వారాల్లో కొవిడ్‌ మరణాల రేటు కూడా తగ్గుతుంది’ అని జైన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

దిల్లీలో ఆదివారం 121 మంది కొవిడ్‌కు బలయ్యారు. గత ఐదు రోజుల్లో 100కు పైగా మరణాలు సంభవించడం ఇది నాలుగోసారి. నవంబరు 18న 131, నవంబరు 20న 118, నవంబరు 21న 111మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.48శాతం కాగా.. దిల్లీలో ఇది 1.58శాతంగా ఉండటం గమనార్హం. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని