ఘనంగా సుధా కొంగర కుమార్తె పెళ్లి - Sudha Kongaras daughter wedding pictures goes viral
close
Published : 03/11/2020 21:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘనంగా సుధా కొంగర కుమార్తె పెళ్లి

హాజరైన ప్రముఖులు..

చెన్నై: దర్శకురాలు సుధా కొంగర కుమార్తె ఉత్తర వివాహ వేడుక ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ శుభకార్యానికి సినీ ప్రముఖులు మణిరత్నం, సుహాసిని, సూర్య, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రత్యేకించి సూర్య పొడవైన జుట్టుతో కనిపించిన తీరు అభిమానుల్ని కట్టిపడేసింది. తన తర్వాతి సినిమాలో సూర్య ఈ గెటప్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

సూర్య-సుధా కొంగర కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా!’. ఎయిర్ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపినాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. నవంబరు 12న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. నిజానికి వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్‌ భావించింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. సూర్య త్వరలో పాండిరాజ్‌ తెరకెక్కించబోతున్న సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా కోసం పై లుక్‌లో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

‘ద్రోహి’ సినిమాతో సుధా కొంగర దర్శకురాలిగా కెరీర్‌ ఆరంభించారు. ఆపై ‘సాలా ఖడూస్‌’తో హిట్‌ అందుకున్నారు. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్‌తో ‘గురు’గా ఆమే తెరకెక్కించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని