హీరోగా సుమ-రాజీవ్‌ కనకాల కుమారుడు - Suma son Roshan is all set to debut as a hero
close
Updated : 03/11/2020 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హీరోగా సుమ-రాజీవ్‌ కనకాల కుమారుడు

హైదరాబాద్‌: ప్రముఖ వ్యాఖ్యాత సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కార్తీక్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు విజయ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను హైదరాబాద్ అల్వాల్‌లోని ఉమాచంద్రమౌళీశ్వరాలయంలో నిర్వహించారు. చిత్ర బృందంతోపాటు సుమ, రాజీవ్‌ పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. ‘పూజా కార్యక్రమం పూర్తయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం నాకే ఇస్తారని ఆశిస్తున్నా (నవ్వుతూ). విజయ్‌ సర్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు, హరి గారు నిర్మాతగా మారారు. మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు. రోషన్‌ లవ్యూ..’ అని అన్నారు.

‘ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను దర్శక, నిర్మాతలు త్వరలోనే వెల్లడిస్తారు. జనవరి నుంచి చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. జేబీ సంస్థ మరిన్ని సినిమాలు నిర్మించి, హిట్లు అందుకోవాలని కోరుకుంటున్నా. హరి, విజయ్‌కు నా శుభాకాంక్షలు’ అని రాజీవ్‌ కనకాల పేర్కొన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని