ఆరెంజ్‌ ఆర్మీ.. ఆరంభానికి అడుగుపడింది.. - SunRisers Hyderabad Fly away to Dubai
close
Published : 24/08/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరెంజ్‌ ఆర్మీ.. ఆరంభానికి అడుగుపడింది..

(ఫొటోలన్నీ సన్‌రైజర్స్‌ ట్విటర్‌ నుంచి సేకరించినవి)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆరెంజ్‌ ఆర్మీ, మన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు ఈరోజు దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కింది. గురు, శుక్రవారాల్లో అన్ని జట్లూ వెళ్లిపోగా ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌, దిల్లీ క్యాపిటల్స్‌ బయిలుదేరాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయా జట్లు ట్విటర్‌లో పంచుకున్నాయి. ఈ సందర్భంగా తమకు మద్దతు తెలపాలని అభిమానులను కోరాయి. మరోవైపు అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ ఇంకో నాలుగు వారాల్లో ప్రారంభంకానుంది. అందుకోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆటగాళ్లు అక్కడికి వెళ్లాక ఆరు రోజులు ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌.. దుబాయ్‌, అబుదాబికి చేరుకొని సాధన కూడా మొదలుపెట్టాయి. ఇప్పుడు సన్‌రైజర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ రెండు ప్రత్యేక విమానాల్లో బయలుదేరి వెళ్లగా కొద్ది సేపటి క్రితమే అక్కడికి చేరుకున్నాయి. శ్రీవాట్స్‌ గోస్వామి అనే సన్‌రైజర్స్‌ ఆటగాడు ట్వీట్‌ చేసి ఆ విషయాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు వారికి కరోనా పరీక్షలు చేశాక హోటల్‌కి తరలిస్తారు. అలాగే వారం రోజులు క్వారంటైన్‌లో ఉంటూనే సాధన చేసుకోవచ్చు. అది కూడా పూర్తయ్యాక ఆటగాళ్లందర్నీ బయో బుడగలోకి అనుమతిస్తారు. ఇక సెప్టెంబర్‌ 19 నుంచి క్రికెట్‌ ప్రేమికులందరికీ కనుల విందే. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని