ఎదిగే సత్తా సుందర్‌కు ఉంది: కటిచ్‌ - Sundar has the potential to become a genuine all-rounder
close
Published : 07/11/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎదిగే సత్తా సుందర్‌కు ఉంది: కటిచ్‌

దుబాయ్‌: యువ క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు అసలు సిసలైన ఆల్‌రౌండర్‌గా మారగల సత్తా ఉందని బెంగళూరు కోచ్‌ సైమన్‌ కటిచ్‌ అన్నాడు. ఒత్తిడితో కూడిన ఓవర్లను విసిరి జట్టును ఎన్నోసార్లు గెలిపించాడని ప్రశంసించాడు. కటిచ్‌ మాట్లాడిన వీడియోను బెంగళూరు ట్విటర్లో పోస్ట్‌ చేసింది.

‘వాషింగ్టన్ ‌సుందర్‌ చాలా ఏళ్లుగా బెంగళూరుకు ఆడుతున్నాడు. అయినప్పటికీ అతడింకా యువకుడే. అతడు పోషించిన పాత్ర అద్భుతం. పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేసి రాణించాడు. ఒత్తిడితో కూడిన ఓవర్లను విసిరి కీలక వికెట్లను తీస్తాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. బ్యాటింగ్‌ పరంగానూ అతడికి అవకాశాలు వచ్చాయి. కొద్ది సమయంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగే సత్తా అతడికి ఉంది. టాప్‌-6లో బ్యాటింగ్‌ చేస్తూ మ్యాచులు గెలిపించే స్థాయికి చేరుకుంటాడు’ అని కటిచ్‌ ధీమా వ్యక్తం చేశాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని