close

తాజా వార్తలు

Updated : 21/10/2020 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అర్జున్‌ రెడ్డికి తండ్రిగా ఆ బాలీవుడ్‌ నటుడేనా? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అర్జున్‌రెడ్డి సినిమాతో బాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్‌దేవర కొండ. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాక్సర్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారని టాలీవుడ్‌ వర్గాల వినికిడి. ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో తెరెకెక్కిస్తున్నారు. అందుకే బాలీవుడ్‌కు చెందిన అనేక మంది ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్కు చెందిన అనన్యా పాండే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇప్పుడు సునీల్‌ శెట్టి ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండకు తండ్రిగా నటించే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్‌. ఈ పాత్ర ప్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో కనిపించనుందని సమాచారం. దీనిపై ‘ఫైటర్’  చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఈ చిత్ర హీరోయిన్‌ అయిన అనన్యా పాండేకు తెలుగులో ఇదే మొదటి చిత్రం కాగా.. విజయ్‌ దేవరకొండకు బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది. చార్మీ కౌర్‌, పూరీ జగన్నాథ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.