సన్నీ లియోనీ.. కొత్త సినిమా గురూ! - Sunny Leones new movie shooting started
close
Published : 21/12/2020 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సన్నీ లియోనీ.. కొత్త సినిమా గురూ!

ముంబయి: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సంపాదించుకున్న నటి సన్నీ లియోనీ. చివరిగా ఆమె వెండితెరపై 2019లో విడుదలైన హిందీ చిత్రం ‘మోతీచూర్‌ చక్నాచూర్‌’లో ఓ అతిధి పాత్రలో కనిపించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌కు కుటుంబంతో సహా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణలు నిలిచిపోవటంతో ఈ ‘రాగిణి ఎంఎంఎస్‌’ తార తెరపై కనిపించక చిన్నబోయిన అభిమానులు.. సన్నీ నేడు చేసిన ప్రకటనపై  హర్షం వ్యక్తంచేస్తున్నారు.

తాను నటించనున్న కొత్త థ్రిల్లర్‌ చిత్రం ‘అనామిక’ను గురించిన విశేషాలను సన్నీ ఈ రోజు వెల్లడించారు. ముంబయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లాప్‌బోర్డును పట్టుకుని ఉన్న చిత్రాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. విక్రమ్‌ భట్‌ సారధ్యంలో తొలిసారిగా నటిస్తున్నట్టు ‘జిస్మ్‌’ నటి తెలిపారు. ‘‘సత్‌నామ్‌. లాక్‌డౌన్‌ అంతమౌతున్న సందర్భంలో.. ఓ కొత్త ప్రారంభం. మంచిగా ఉండే విక్రమ్‌ భట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభం.’’ అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చింది. కాగా లాక్‌డౌన్‌ విధించినప్పటినుంచి ఆమె తొలి ప్రాజక్టు ఇదే కావటం విశేషం.

ఇవీ చదవండి

ఇక.. రచయిత్రి కరీనా కపూర్‌!

 జామూన్‌.. రసగుల్లా!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని