close

తాజా వార్తలు

Published : 28/11/2020 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభాస్‌ తమ్ముడిగా ఇతడేనా..?

సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించనున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా, బాలీవుడ్‌ స్టార్‌హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటించనున్నారు. అయితే ఈ సినిమాలో సీతగా ఎవరు కనిపించనున్నారు? లక్ష్మణుడి పాత్రను ఎవరు పోషించనున్నారనే విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. దీంతో సోషల్‌మీడియా వేదికగా ‘ఆదిపురుష్‌’ చిత్రానికి సంబంధించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ సీత పాత్రను పోషించనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, మరో బాలీవుడ్‌ నటుడు సైతం ‘ఆదిపురుష్‌’లో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ‘సోను కే టీటూ కీ స్వీటీ’ చిత్రంతో నటనపరంగా ప్రతిభను కనబరిచిన సన్నీ సింగ్‌ ఈ చిత్రంలో లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా, ఈ విషయమై ఇప్పటికే ‘ఆదిపురుష్‌’ టీమ్‌ సన్నీ సింగ్‌తో సంప్రదింపులు జరిపినట్లు బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ సన్నీసింగ్‌ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.



Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని