ఇక అక్కడ ఎన్నికల ర్యాలీలు నిర్వహించుకోవచ్చు! - Supreme stayed curbs on Election rallies put by MP High Court
close
Updated : 26/10/2020 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక అక్కడ ఎన్నికల ర్యాలీలు నిర్వహించుకోవచ్చు!

ప్రచారంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆంక్షల్ని నిలిపేసిన సుప్రీం

దిల్లీ: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల బహిరంగ సభలపై హైకోర్టు విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాల్ని సవాల్‌ చేస్తూ ఎన్నికల సంఘం(ఈసీ), భాజపా నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం నేడు విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలు అభ్యర్థుల ప్రచారం నిర్వహించుకునే హక్కును ఉల్లంఘిస్తున్నాయని భాజపా కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారులు లేవనెత్తిన అంశాల్ని పరిశీలించాలని ఈసీని సుప్రీం ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రచార సమయాన్ని కోల్పోయామని భావిస్తున్న పార్టీలు ఈసీని సంప్రదించాలని తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు ఈసీ పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. ర్యాలీల్లో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే హైకోర్టు ఆంక్షలు విధించాల్సి వచ్చిందని అభిప్రాయపడింది.  

కరోనా వైరస్ కారణంగా ఉప ఎన్నికలు జరిగే 9 జిల్లాల్లో నేరుగా ర్యాలీలు చేపట్టరాదని, వర్చువల్‌గా ప్రచారం చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఏ అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి అనుమతి ఇవ్వరాదని ఆయా జిల్లాల కలెక్టర్లకు ధర్మాసనం సూచించింది. వర్చువల్ ప్రచారం సాధ్యం కాని పక్షంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా ఉందని భావిస్తే భౌతిక ర్యాలీలకు కలెక్టర్ అనుమతించాలని పేర్కొంది.

హైకోర్టు నిర్ణయంపై ఎన్నికల కమిషన్, ఇద్దరు భాజపా అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు నిర్వహించడం తమ పరిధిలోని అంశమని.. హైకోర్టు ఆదేశాలు ఎన్నికల విధానంలో జోక్యం చేసుకోవడమేనని ఈసీ వాదించింది. కోర్టు నిర్ణయం ఎన్నికల ప్రక్రియను పక్కదారి పట్టించేలా ఉందని పేర్కొంది. ఈ ఆంక్షలు అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో ప్రభావం చూపుతాయని ఈసీ స్పష్టం చేసింది. వీటిపై విచారణ జరిపిన సుప్రీం నేడు ఆంక్షల్ని నిలపుదల చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని