సూర్య.. యువకుడిలా మారాడిలా..! - Suriya Transformed To Play The Teenager role in Akashame nee Haddhura
close
Published : 08/11/2020 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్య.. యువకుడిలా మారాడిలా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన సినిమాలతో అభిమానులను అలరిస్తుంటాడు సూర్య. మరోసారి వినూత్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో సూర్య వేర్వేరు వయస్సులు ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకు విమాన ప్రయాణం అందించాలన్న సంకల్పంతో పరితపించే ఓ యువకుడి పాత్రను సూర్య పోషించాడు. అయితే.. ఈ పాత్రకు సరైన న్యాయం చేసేందుకు నలభయేళ్ల సూర్య చాలా కష్టపడ్డాడట. ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెప్పినప్పటికీ 27 రోజుల పాటు ఇబ్బందికర డైట్‌ పాటించాడట. మరి యువకుడి పాత్రలో సూర్య నటన గురించి చర్చించాలి అంటే మరికొన్ని రోజులు ఓటీటీ వేదికగా విడుదల కానున్న చిత్రం కోసం వేచి చూడాల్సిందే.

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 30నే విడుదలకావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల నవంబర్‌ 12కు వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. మోహన్‌బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. అపర్ణ బాలమురళీ హీరోయిన్‌. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని