సారా గురించే మాట్లాడారు.. సుశాంత్‌ బాధపడ్డాడు! - Sushant Singh Rajput ‘was very troubled during Kedarnath shoot
close
Published : 08/12/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సారా గురించే మాట్లాడారు.. సుశాంత్‌ బాధపడ్డాడు!

‘కేదార్‌నాథ్‌’ కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కెరీర్‌లో హిట్‌గా నిలిచిన చిత్రం ‘కేదార్‌నాథ్‌’. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2013 జూన్‌లో ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. 4 వేల మంది మృతి చెందగా, 70 వేల మంది గల్లంతయ్యారు. దీని ఆధారంగా దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ ‘కేదార్‌నాథ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. కథానాయికగా సారా అలీ ఖాన్‌ తొలి సినిమా కావడం విశేషం. సోమవారంతో ఈ సినిమా విడుదలై రెండేళ్లయింది. ఈ సందర్భంగా చిత్రీకరణలో జరిగిన కొన్ని సంఘటనల్ని అభిషేక్‌ గుర్తు చేసుకున్నారు.

‘‘కేదార్‌నాథ్‌’ ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు సుశాంత్‌ చాలా కష్టపడ్డాడు. ఎముకలు కొరికే చలిలో వీపుపై సారాను ఎత్తుకుని నడిచేవాడు. టేక్‌ బాలేదు, మరోటి తీద్దామన్నప్పుడు కూడా నో చెప్పలేదు. సుశాంత్‌ మానసికంగా, శారీరకంగా చాలా దృఢమైన వ్యక్తి. వీపుపై భారీ బరువుతో కొండల్ని ఎక్కడం అంత సులభం కాదు, అందరూ దీన్ని చేయలేరు. ఓ నటుడిగా సుశాంత్‌ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పని చేశారు. ఉత్తరాఖండ్‌లో చిత్రీకరణ సమయంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలకు పడిపోయాయి. సెట్‌లో అందరూ చలిని తట్టుకోవడానికి జాకెట్లు వేసుకుంటే.. సుశాంత్‌ మాత్రం వణికిపోతూ, తడిచేవాడు. సినిమా చక్కగా తెరపైకి రావాలని ఎంతో శ్రమించాడు. కానీ ‘కేదార్‌నాథ్’ విడుదలైనప్పుడు అది ప్రముఖ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా తొలి సినిమా కావడంతో మీడియా దృష్టి మొత్తం ఆమెపైనే కేంద్రీకృతమైంది. దాంతో తన కష్టానికి తగ్గ ఆదరణ లభించలేదని, గుర్తించలేదని సుశాంత్‌ బాధపడ్డాడు. సినిమాను కోల్పోయిన భావనలోకి వెళ్లాడు’ అని అభిషేక్‌ చెప్పారు. సుశాంత్‌ ఈ ఏడాది జూన్‌లో ఆత్మహత్య చేసుకుని అందర్నీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.
ఇవీ చదవండి..
నా రంగు వల్ల ఎన్నో ఆఫర్లు కోల్పోయా!
నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని