సుశాంత్‌సింగ్‌ కేసు: విచారణకు మహేష్‌ భట్‌ - Sushant Singh Rajput Case Mahesh Bhatt Karan Johars manager to be questioned
close
Published : 26/07/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌సింగ్‌ కేసు: విచారణకు మహేష్‌ భట్‌

కరణ్‌ జోహార్‌ మేనేజర్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు హోంమంత్రి వెల్లడి

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే పరిశ్రమకు చెందిన పలువురిని విచారించారు. కేసుకు సంబంధించి సినీ నిర్మాత మహేష్‌భట్‌తోపాటు కరణ్‌ జోహార్‌ మేనేజర్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదివారం వెల్లడించారు. సోమవారం మహేష్‌ భట్‌ను ప్రశ్నించనున్నామని, ఆ తర్వాత కరణ్‌ జోహార్‌ మేనేజర్‌ను విచారించనున్నట్లు తెలిపారు. ‘అవసరమైతే పోలీసులు కరణ్‌ జోహార్‌ను కూడా విచారణకు పిలుస్తారు. వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఇదివరకే నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేశాం’ అని దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు. 

సుశాంత్‌సింగ్‌ మృతి కేసులో బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన దాదాపు 30 మందిని పోలీసులు ఇప్పటివరకు విచారించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ, డైరెక్టర్‌-నిర్మాత ఆదిత్య చోప్రా ఈ జాబితాలో ఉన్నారు. సుశాంత్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ నటి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో పేర్కొనడంపై రాష్ట్ర హోంమంత్రి గతవారం స్పందించారు. కేను సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని, ముంబయి పోలీసులు తమ విచారణను సమర్థంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సుశాంత్‌సింగ్‌ ముంబయిలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో జూన్‌ 14న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని