సుశాంత్‌సింగ్‌ కేసులో విచారణకు హాజరైన మహేష్‌ భట్‌ - Sushant Singh Rajput Death Filmmaker Mahesh Bhatt Joins Probe
close
Published : 27/07/2020 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌సింగ్‌ కేసులో విచారణకు హాజరైన మహేష్‌ భట్‌

దిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ప్రముఖ నిర్మాత మహేష్‌ భట్‌ విచారణకు హాజరయ్యారు. ముంబయిలోని శాంటాక్రుజ్‌ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు పోలీసు డిప్యూటీ కమిషనర్‌ అభిషేక్‌ త్రిముఖే ఎదుట ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. మహేష్‌ భట్‌తోపాటు కరణ్‌ జోహార్‌ మేనేజర్‌ను కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదివారం కోరారు. నటి కంగనా రనౌత్‌ను కూడా వాంగ్మూలం రికార్డు చేసేందుకు రావాలని సూచించారు. 

సుశాంత్‌సింగ్‌ జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్‌ ఇండస్ట్రీలోని బంధుప్రీతి (నెపోటిజం) వల్లనే సుశాంత్‌ సింగ్‌ తనువు చాలించినట్లు కంగనా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. మార్చి 17 నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని తన ఇంట్లోనే ఉంది కంగనా. ఓ పోలీసు బృందాన్ని పంపించి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోవాలని కంగన పోలీసులను కోరింది. ఈ కేసులో ఇండస్ట్రీకి చెందిన పలువురిని ఇప్పటికే ముంబయి పోలీసులు ప్రశ్నించారు. క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ముకేష్‌ ఛబ్రా, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఛైర్మన్‌ ఆదిత్య చోప్రా, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ షనూ శర్మ, సినిమా క్రిటిక్‌ మసంద్‌ ఈ జాబితాలో ఉన్నారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని