రియా పరారీలో ఉంది: బిహార్‌ పోలీసులు - Sushant Singh Rajput case Bihar Police say Rhea Chakraborty absconding urge Mumbai Police to exempt their officer from quarantine
close
Published : 05/08/2020 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియా పరారీలో ఉంది: బిహార్‌ పోలీసులు

ఐపీఎస్‌ను విడిచిపెట్టాలని బీఎంసీని కోరిన డీజీపీ

దిల్లీ: నటుడు సుశాంత్‌సింగ్‌ ప్రియురాలు రియా చక్రవర్తి పరారీలో ఉన్నట్లు బిహార్‌ పోలీసులు వెల్లడించారు. సుశాంత్‌ తండ్రి పాట్నాలో రియాపై కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు ప్రారంభించిన బిహార్‌ పోలీసులు ఆమె పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ‘రియా చక్రవర్తి మాకు అందుబాటులో లేరు. ఆమె పరారీలో ఉన్నారు. దర్యాప్తునకు ముందుకు రావడం లేదు. ముంబయి పోలీసులకు కూడా ఆమె టచ్‌లో లేదు’ అని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ గుప్తేశ్వర్‌ పాండే తెలిపారు. ఈ కేసును పాట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ రియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించిన రోజే  రియా పరారీ అంశాన్ని పోలీసులు ప్రకటించారు . కాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును అంగీకరించినట్లు కేంద్రం సుప్రీంకు తెలిపింది. 

ఆత్మహత్యకు ప్రేరేపించడంతోపాటు, మరిన్ని సెక్షన్ల కింద రియా చక్రవర్తిపై సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ బిహార్‌ రాజధాని పాట్నాలో పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బిహార్‌ పోలీసు బృందం దర్యాప్తు కోసం ముంబయికి చేరుకుంది. అయితే ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఐపీఎస్‌ అధికారి వినయ్‌ తివారిని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) క్వారంటైన్‌లో ఉంచింది. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు బీఎంసీ తెలిపింది. ఈ చర్యను బిహార్‌ పోలీసులు ఖండించారు. అధికారిని బలవంతంగా నిర్బంధించినట్లు ఆరోపించారు. కాగా ఈ విషయంపై బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే బుధవారం స్పందించారు.  ‘ఐపీఎస్ అధికారికి వినయ్‌ తివారికి క్వారంటైన్‌ను మినహాయించాలని బీఎంసీని అభ్యర్థించాము. ఐపీఎస్ అధికారి కాబట్టి కనీసం అతడిని తిరిగి పంపమని కోరాము. ఇది ఉత్తమ ప్రవర్తన కాదు. ఆ అధికారిని అరెస్టు చేసినట్లుగా ఉంచారు’ అని డీజీపీ అన్నారు.

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబయిలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయి పోలీసులతోపాటు, బిహార్‌ పోలీసులు సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్‌ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు నిర్ధరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 56 మందిని ఇప్పటివరకు విచారించినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. వారిలో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు, నటుడి కుటుంబసభ్యులు, అతడి పనిమనుషులు ఉన్నారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని