డ్రగ్స్‌ మూలాలు కనిపెట్టే పనిలో ఎన్‌సీబీ - Sushant Singh Rajput death case NCB probe leads to Amritsar Pakistan and drug cartels
close
Published : 22/09/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ మూలాలు కనిపెట్టే పనిలో ఎన్‌సీబీ

దిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య ఘటనపై జరుగుతున్న విచారణ అనేక కీలక మలుపులు తిరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) డ్రగ్స్‌ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ నటుల పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు విచారణను ఎన్‌సీబీ మరింత ముమ్మరం చేసింది. చిత్ర పరిశ్రమలోకి డ్రగ్స్‌ రావడానికి మూలాలు ఎక్కడున్నాయో శోధించే పనిలో పడింది. పాకిస్థాన్‌, అమృతసర్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి ముంబయి డ్రగ్స్‌ ఎలా వస్తున్నాయనే దానిపై ఆరా తీస్తోంది.

‘‘బాలీవుడ్‌లోకి డ్రగ్స్‌ ఎలా వస్తున్నాయనే దానిపై మాకు స్పష్టమైన ఆలోచన ఉంది. హెరాయిన్‌, కొకైన్‌ వంటి వాటిని సరఫరా చేసేవాళ్లను పట్టుకోవాలంటే సరైన ఆధారాలు లభించాలి. ఒకసారి అవి లభిస్తే, వాళ్లందరిపైనా కేసులు నమోదు చేస్తాం’’ అని ఎన్‌సీబీ సీనియర్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతోనూ ఇక్కడి అధికారులు మాట్లాడుతున్నారు. ముంబయికి డ్రగ్స్‌ ఎలా వస్తున్నాయని దానిపై వారితో చర్చలు జరుపుతున్నారు.

2018లో 1,200 కిలోల కొకైన్‌ భారత్‌కు వచ్చినట్లు సమాచారం. ఒక్క ముంబయికే 300 కిలోల కొకైన్‌ తరలించారట. జూన్‌ 2019లో 55 కిలోల కొకైన్‌ను ఆస్ట్రేలియాలో సీజ్‌ చేశారు. దీంతో ఆ కొకైన్‌ ఆస్ట్రేలియాకు ఎక్కడి నుంచి వెళ్లిందనే దానిపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. కొలంబియా, బ్రెజిల్‌, మొజాంబిక్‌ సహా ఆఫ్రికా దేశాల నుంచి దుబాయ్‌కి అక్కడి నుంచి భారత్‌కు వస్తోందని ఎన్‌సీబీ గుర్తించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని