సుశాంత్‌కు అపాయం ఉందంటే పట్టించుకోలేదట! - Sushant Singh Rajput father in a self-made video
close
Published : 04/08/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌కు అపాయం ఉందంటే పట్టించుకోలేదట!

పట్నా: సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసులో రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది. అటు ముంబయి పోలీసులు, ఇటు బిహార్‌ పోలీసులు ఈ కేసు విచారణలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ విడుదల చేసిన ఓ వీడియో చర్చకు దారి తీసింది. తన కుమారుడి జీవితం ప్రమాదంలో ఉందని ఈ ఏడాది ఫిబ్రవరి 25న తాను బంద్రా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో సుశాంత్‌ ఆత్మహత్య కేసు మరో మలుపు తీసుకుంది.

‘‘నా కుమారుడి జీవితం ప్రమాదంలో ఉందని ఫిబ్రవరి 25న బంద్రా పోలీసులకు సమాచారం ఇచ్చాను. జూన్‌ 14న సుశాంత్‌ చనిపోయాడు. ఆనాడు తాను చేసిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగాను. సుశాంత్‌ చనిపోయి 40 రోజులు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థమైంది. దీంతో పట్నాలో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశాను.’’ అని ఆయన అన్నారు.

ఇటీవల సుశాంత్‌ తండ్రి తరపు న్యాయవాది వికాస్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ముంబయి పోలీసులు జరుపుతున్న కేసు విచారణ సుశాంత్‌ కుటుంబానికి మానసిక క్షోభను కలిగిస్తోంది. సుశాంత్‌ చుట్టూ ఉన్న వారితో అతనికి అపాయం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న తర్వాత దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా రియాపై ఎలాంటి విచారణ జరపలేదు. ఆమెకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని