విచారణలో సారా, శ్రద్ధా అబద్ధాలు చెప్పారు - Sushant Singh Rajputs friend reacts to Sara Ali Khan and Shraddha Kapoors claims that late actor consumed drugs
close
Published : 27/09/2020 19:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విచారణలో సారా, శ్రద్ధా అబద్ధాలు చెప్పారు

సుశాంత్‌ స్నేహితుడు యువరాజ్

ముంబయి: బాలీవుడ్‌ హీరోయిన్స్‌ సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌ శనివారం జరిగిన ఎన్సీబీ విచారణలో అబద్ధాలు చెప్పారని సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్‌ స్నేహితుడు యువరాజ్ ఆరోపణలు చేశారు. సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసును డ్రగ్స్‌ కోణంలో విచారిస్తోన్న ఎన్సీబీ అధికారులు సారా, శ్రద్ధాకపూర్లకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణలో పాల్గొన్న సారా, శ్రద్ధా.. సుశాంత్‌ మాదకద్రవ్యాలు వినియోగించడం చాలా సందర్భాల్లో చూశామని, కానీ తాము మాత్రం డ్రగ్స్‌ తీసుకోలేదని ఎన్సీబీ ఎదుట చెప్పినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ స్నేహితుడు యువరాజ్‌ సదరు నటీమణుల విచారణ గురించి స్పందించారు.

‘తాము ఎలాంటి తప్పు చేయలేదని, సుశాంత్‌ మాత్రం తరచూ డ్రగ్స్‌ వినియోగించడం చూశామని సదరు నటీమణులిద్దరూ పూర్తిగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లు చెప్పిన ఈ మాటలు గురించి వింటుంటే నవ్వొస్తోంది. వాళ్లు నా స్నేహితుడిపై బురద జల్లుతున్నారు. తాము కూడా డ్రగ్స్‌ వినియోగిస్తామని, సరఫరా చేస్తామని.. ఒకవేళ ఎన్సీబీ విచారణలో కనుక వాళ్లు అంగీకరించివుంటే వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకుంటారనే విషయం వాళ్లకి తెలుసు. అందుకే వాళ్లు కొన్ని విషయాలు బయటకు చెప్పలేదు.’

సుశాంత్‌కి న్యాయం చేయండి

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసులో నిందితులను త్వరగా అరెస్ట్‌ చేసి.. త్వరితగతిన అతనికి న్యాయం చేకూర్చాలని.. హీరో కుటుంబసభ్యులతోపాటు అభిమానులు సైతం కోరుతున్నారు. ఈమేరకు ట్విటర్‌ వేదికగా JusticeForSushantSinghRajput పేరుతో వరుస ట్వీట్లు పెడుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని