సుశాంత్‌సింగ్‌ శవపరీక్ష నివేదిక 17న! - Sushant case Viscera report to be ready on September 17 or 20
close
Updated : 15/09/2020 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌సింగ్‌ శవపరీక్ష నివేదిక 17న!

దిల్లీ: నటుడు సుశాంత్‌సింగ్‌ మృతికి సంబంధించిన పలు కీలక విషయాలు త్వరలోనే బహిర్గతం కానున్నాయి. ఈ కేసుకు సంబంధించిన శవపరీక్ష నివేదికను దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఈనెల 17న లేదా 20న సీబీఐకి అప్పగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నటుడి శరీర అంతర్భాగాల నుంచి సేకరించిన నమూనాలను ఎయిమ్స్‌ వైద్యబృందం పరిశీలిస్తోంది. మాదకద్రవ్యాలు వినియోగించాడా లేదా అనే నేపథ్యంలోనూ వాటికి పలు రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. నటుడి కుటుంబసభ్యుల ఆరోపణలు, సోషల్ మీడియాలో అభిమానులు లేవనెత్తిన సందేహాల ఆధారంగా కూడా శవపరీక్ష నివేదికను అధ్యయనం చేయనుంది. మహారాష్ట్ర నుంచి పలు నమూనాలు అందాయని వాటిని పరిశీలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 17వ తేదీన మెడికల్ బోర్డు అధికారులు సమావేశమయ్యే అవకాశం ఉందని, అప్పుడే నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పుడు కుదరకపోతే దర్యాప్తులో పాల్గొన్న అన్ని ఏజెన్సీలతో 20న జరిగే సమావేశంలో సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని