మాస్క్‌ ఎలా ధరించాలో హంస నేర్పించింది - Swan teaches woman how to wear mask
close
Updated : 22/09/2020 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ ఎలా ధరించాలో హంస నేర్పించింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా మాస్క్‌ లేకుండా బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొంత మంది మాస్క్‌ పెట్టుకుని, శ్వాస సరిగా ఆడట్లేదనో.. ఎదుటివారికి ముఖం కనిపించాలనో మాస్క్‌ను కిందకి లాగేస్తున్నారు. అయితే ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ కూడా అలాగే తను ధరించిన మాస్క్‌ను కిందకు లాగి హంసతో ఆడుకునే ప్రయత్నం చేసింది. వెంటనే ఆ హంస మాస్క్‌ను లాగి ‘మాస్క్‌ సరిగా పెట్టుకో అన్నట్లు..’ ముక్కుపైకి వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మాస్క్‌ ఎలా ధరించాలో హంస నేర్పిస్తుంది.. హంస కూడా ప్రజలు కొవిడ్‌-19 నిబంధనలు పాటించేలా చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు లక్షల్లో లైకులు వచ్చాయి. మరి ఆ వీడియోను మీరు చూడండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని