లీగ్‌ ‘సమ్‌’గతులు - T20 cricket League Social Look
close
Published : 15/10/2020 20:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లీగ్‌ ‘సమ్‌’గతులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌ లీగ్‌ గేరు మార్చి దూసుకెళుతోంది. మొన్నటి వరకూ బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌లు ఇప్పుడు బౌలర్లకు దాసోహమంటున్నాయి. బ్యాట్‌కు బ్యాట్‌కు జరిగిన పోరు కాస్తా ఇప్పుడు.. బంతికి బంతికి మధ్య జరుగుతోంది. ప్లేఆఫ్‌ రేసులో ఎలాగైనా ముందడుగు వేయాలని అన్ని జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మైదానాల్లో చెమటోడ్చే ఆటగాళ్లు.. మ్యాచ్‌కి మ్యాచ్‌కీ మధ్య విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతకీ ఎవరేం చేస్తున్నారో తెలుసా..?

ఈ పోటీ చాలా టఫ్‌ గురూ..

ఇద్దరు సోదరులు పోటీ పడితే అంతకంటే కఠినమైన పోటీ మరొకటి ఉండదని ముంబయి జట్టు పేర్కొంది. హార్దిక్‌ పాండ్య, కృణాల్‌ పాండ్య కలిసి ఆడుకుంటున్న ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది.


కోల్‌కతా తయార్‌..

కోల్‌కతా ఆటగాళ్లు హెయిర్‌కట్‌ చేయించుకుంటున్న ఫొటోలను ఆ జట్టు యాజమాన్యం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ పోస్టులో శుభ్‌మన్‌ గిల్‌, క్రిస్‌ గ్రీన్‌.. జట్టు కత్తిరించుకుంటున్నారు. ‘కోల్‌కతా తయార్‌’ అంటూ జట్టు యాజమాన్యం ఆ పోస్టులో పేర్కొంది.


డబుల్‌ ట్రబుల్‌..

బెయిర్‌స్టో ఎత్తుకున్నది ఎవర్నీ..? హైదరాబాద్ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో మరో ఆటగాడు శ్రీవాత్స్‌ గోస్వామి వచ్చి ఇలా అతని భుజాల మీద కూర్చున్నాడు. ఈ చిత్రాన్ని డబుల్‌ ట్రబుల్‌ అంటూ హైదరాబాద్‌ జట్టు యాజమాన్యం ట్విటర్‌లో పోస్టు చేసింది.


దిగ్గజ పాఠాలు..

ఒక క్రికెట్‌ దిగ్గజం.. యువ క్రికెట్‌కు పాఠాలు చెబుతోంది. అంటూ రాజస్థాన్‌ జట్టు ట్విటర్‌ హ్యాండిల్‌లో ఓ పోస్టు చేసింది. అందులో ఆ జట్టు కోచ్‌ షేన్‌ వార్న్‌ కొంతమంది యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ కనిపించాడు.


ఒక చిత్రం.. వేగం మూడింతలు..

ఒకే చిత్రంలో ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు. లీగ్‌లో అత్యధిక వేగంతో బంతులు విసిరిన బౌలర్లు ముగ్గురినీ ఒకే ఫ్రేమ్‌లో బంధించిన ఫొటోగ్రఫర్‌ను అభినందించాలి.. అంటూ దిల్లీ ఓ పోస్టు చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని