నవంబర్‌ నుంచి ‘రష్మి రాకెట్‌’ షురూ! - Taapsee Pannu New Movie Rashmi Rocket goes sets in November
close
Published : 21/08/2020 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవంబర్‌ నుంచి ‘రష్మి రాకెట్‌’ షురూ!

ముంబయి: తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన ఆమె, ఇప్పుడు కథా బలమున్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది ‘థప్పడ్‌’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాప్సీ మరోసారి వైవిధ్యమైన కథను ఎంచుకున్నారు. ‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో షూటర్‌గా కనిపించిన ఆమె ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వంలో ‘రష్మి రాకెట్‌’గా అలరించబోతున్నారు. ప్రియాన్షు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇందులో తాప్సీ రన్నర్‌గా కనిపించనున్నారు. ఏడాది క్రితమే ఈ చిత్రాన్ని ప్రకటించినా, షూటింగ్‌కు నోచుకోలేదు. ఇప్పుడు  నవంబర్‌ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర బృందం తెలిపింది. నవంబర్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. రోని, నేహా ఆనంద్‌, ప్రంజల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని