సినీనటి తాప్సీకి జరిమానా! - Taapsee Pannu fined for not wearing a helmet
close
Updated : 19/11/2020 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినీనటి తాప్సీకి జరిమానా!

ముంబయి: సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నుకి జరిమానా పడింది. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపినందుకు తనకు ఫైన్‌ పడినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. బైక్‌ రైడింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే తాప్సీ.. కాస్త తీరిక సమయం దొరకడంతో బైక్‌ నడిపిందట. అయితే.. హెల్మెట్‌ లేకుండా రోడ్లపై తిరిగినందుకు ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ఆమెకు జరిమాన విధించారట. అభిమానులు మాత్రం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించవద్దని ఆమె కోరింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. దానికి ఆమె వాహనం నడిపిస్తున్న ఫొటోను కూడా జతచేసింది.

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంటోందీ దిల్లీ ముద్దుగుమ్మ. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ భామ ఈ ఇటీవల కాలంలో బీటౌన్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. తాప్సీ తన తర్వాతి సినిమాలో బ్యాట్మింటన్‌ క్రీడాకారిణిగా అభిమానుల ముందుకు రానుంది. గుజరాత్‌కు చెందిన షట్లర్‌ రష్మీ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె నటిస్తోంది. అందుకోసం తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటూ చెమటోడుస్తోంది. ఆ సినిమా తర్వాత భారత మహిళా క్రికెటర్‌ మిథాలిరాజ్‌ పాత్ర జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘శెభాష్‌ మిథూ’ సినిమాతో ఆమె క్రికెటర్‌ అవతారమెత్తనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని