close
Array ( ) 1

తాజా వార్తలు

నాలుగేళ్లుగా సిద్ధమవుతున్నా కానీ..

ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ కాంట్రవర్సీపై స్పందించిన తాప్సీ

ముంబయి: ఇటీవల నిర్వహించిన 65వ ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో తాప్సీ మొదటిసారి ఉత్తమ నటి(క్రిటిక్స్‌) అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ‘శాండ్ ఖీ అంఖ్‌’ చిత్రానికి గాను తాప్సీ, భూమి ఫడ్నెకర్‌ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం గురించి సోషల్‌మీడియాలో వేదికగా వెల్తువెత్తిన విమర్శలపై తాప్సీ తనదైన శైలిలో స్పందించారు. తాజాగా తాప్సీ ఓ అవార్డలు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘2016 నుంచి అవార్డులను సొంతం చేసుకుంటే స్టేజ్‌పై ఏం మాట్లాడాలనే విషయంలో స్పీచ్‌ సిద్ధం చేసుకునేదాన్ని. గడిచిన నాలుగేళ్లలో స్టేజ్‌పై మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఈ ఏడాది మాత్రం నేను ఎలాంటి స్పీచ్‌ను సిద్ధం చేసుకోలేదు. కానీ నేను స్టేజ్‌పై మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల సమయం తీసుకున్నప్పటికీ అవార్డు గెలుపొందడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇంతకు మించి నేను ఏం చెప్పగలను’ అని తాప్సీ అన్నారు.

అనంతరం ఆమె ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ కాంట్రవర్సీ గురించి మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో నేను ఉంటుండేదాన్ని. కానీ ఈ సారీ కాంట్రవర్సీలో నా పేరు లేకపోవడం బాగుంది. దీనిని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫిలింఫేర్‌ అవార్డుకు నేను అర్హురాలినేనని చాలామంది నమ్ముతున్నారు. దానికి నేనేంతో సంతోషిస్తున్నాను.’ అని తాప్సీ తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
dr madhu
HITS2020
besttaxfiler
VITEEE 2020
Saket Pranamam

Panch Pataka

దేవతార్చన