హీరో భార్యకు నచ్చలేదని తొలగించారు: తాప్సీ - Taapsee Pannu reveals she was once replaced because the hero wife didnot want her in the film
close
Published : 19/11/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హీరో భార్యకు నచ్చలేదని తొలగించారు: తాప్సీ

ముంబయి: మహిళా ప్రాధాన్యమున్న విభిన్న కథా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి తాప్సీ. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి.. కథానాయికగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో పలువురు నుంచి విమర్శలు ఎదుర్కొంది. కొంతమంది ఈమెను ఐరన్‌లెగ్‌ అని విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కథ మారింది. ‘పింక్‌’, ‘బద్లా’, ‘గేమ్‌ ఓవర్‌’, ‘సాండ్‌ ఖీ ఆంఖ్‌’, ‘థప్పడ్‌’ చిత్రాలతో కథానాయికగా ఆమె వరుస ఘన విజయాలను అందుకొంది.

తాజాగా తాప్సీ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా. కొంతమంది నేను అందంగా లేనన్నారు. ఓ సినిమాలో నేను భాగం కావడం హీరో భార్యకు నచ్చకపోవడంతో నన్ను తప్పించారు. అలాగే డబ్బింగ్‌ చెప్పే సమయంలో హీరోకి నా డైలాగ్‌లు నచ్చకపోతే మార్చాలని చెప్పేవాళ్లు. ఒకవేళ నేను నిరాకరిస్తే వెంటనే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌తో డైలాగులు చెప్పించేవాళ్లు. హీరో నటించిన ముందు సినిమా విజయం సాధించలేదని చెప్పి.. బడ్జెట్‌ కంట్రోల్‌ చేయడం కోసం నా రెమ్యూనరేషన్‌ తగ్గించిన సందర్భాలూ ఉన్నాయి. సినిమాలో అతడి పరిచయ సన్నివేశాలకంటే నా పరిచయ సన్నివేశాలు పవర్‌ఫుల్‌గా ఉన్నాయని ఓ హీరో నా సన్నివేశాలు మార్పించాడు. ఇవన్నీ నా ముందు జరిగిన విషయాలు. మరి నా వెనుక ఏం జరిగిందో తెలియదు’

‘అలాంటి సమయంలో ఇకపై నటించే సినిమాలన్నీ నాకు సంతోషాన్ని అందించాలని ఫిక్స్‌ అయ్యాను. ఒకవేళ ఎవరైనా నటి మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకుంటే.. ఆ అమ్మాయితో నటించడానికి హీరోలు సందేహిస్తారు అనే ట్యాగ్‌ వేసేస్తారు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రయాణమే అయి ఉండొచ్చు గానీ ప్రతిరోజూ నేను ఎంజాయ్‌ చేస్తున్నా’ అని తాప్సీ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని