‘రష్మీ రాకెట్‌’ కోసం చెమటోడుస్తున్న తాప్సీ - Taapsee Pannu working Hard for Rashmi Rocket
close
Published : 09/11/2020 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రష్మీ రాకెట్‌’ కోసం చెమటోడుస్తున్న తాప్సీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొట్టబుగ్గల సుందరి తాప్సీపన్ను తన తర్వాతి సినిమా కోసం చెమటోడుస్తోంది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమా ‘తప్పడ్‌’తో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది ఈ భామ. ఈసారి ‘రష్మీ రాకెట్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం ఆమె తీవ్రంగా కష్టపడుతోంది. గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా తాప్సీ కనిపించనుంది. చిత్రీకరణలో భాగంగా ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో శిక్షణ తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

పూర్తిస్థాయి అథ్లెట్‌గా కనిపించేందుకు న్యూట్రీషియనిస్టు, ఫిజియోథెరఫిస్టు, ట్రాక్‌ ట్రైనర్‌, అథ్లెటిక్‌ కోచ్‌ సహకారం తీసుకుంటున్నట్లు ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమాకు అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్వ్కువ్యాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాప్సీ భర్త పాత్రలో ప్రియాన్షు పైన్యూలి కనిపించనున్నారు. ఆమె ప్రధానపాత్రలో నటించిన ‘తప్పడ్‌’ ఈ ఏడాది విడుదలై మంచి ఫలితాలు రాబట్టింది. విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. ఇదిలా ఉండగా.. తాప్సీ నటిస్తున్న మరో సినిమా ‘హసీన్‌ దిల్‌రుబా’ ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని