వరద బాధితుల కోసం చర్యలు చేపట్టాలి: పవన్‌ - Take necessary steps for people in the flood hit areas
close
Published : 17/08/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరద బాధితుల కోసం చర్యలు చేపట్టాలి: పవన్‌

అమరావతి: గోదావరి వరద ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంటుందని కేంద్ర జల సంఘం హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సన్నద్ధతో ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేటప్పటికే గోదావరి జిల్లాలలోని లంక భూముల, కొన్ని గ్రామాలు నీట మునిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం ఆందోళనల ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. మరోవైపు ఎగువనఉన్న భద్రాచలంలో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తతో తగిన పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు.

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి తగిన వైద్యారోగ్య వసతులు కల్పించాలని పవన్‌ సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరద బాధితులను తరలించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలనన్నారు. భౌతిక దూరం ఉండేలా లాంచీలు, మర బోట్లను ఎక్కువ సంఖ్యలో సిద్ధం చేసుకోవడంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. అలాగే పంటలు నష్టపోతున్న రైతులకు భరోసా కల్పించేలా విధంగా ప్రభుత్వం ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని ప్రకటించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని