అంధాధున్‌ రీమేక్‌కు ఓకే చెప్పిన తమన్నా - Tamannah to reprise Tabus role which will be reworked
close
Published : 20/09/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంధాధున్‌ రీమేక్‌కు ఓకే చెప్పిన తమన్నా

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘అంధాధున్‌’ను నితిన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ డైరెక్టర్‌. కథానాయికగా ఇస్మార్ట్‌భామ నభా నటేశ్ కనిపించనుంది. ఈ సినిమాలో హీరోతో సమాన ప్రాధాన్యత గల ఓ పవర్‌ఫుల్‌ లేడీ పాత్ర ఉంటుంది. హిందీలో ఆ పాత్రలో టబు కనిపించి మెప్పించారు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అయితే, రీమేక్‌లో ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై పలు వార్తలు వినిపించాయి. పవర్‌ఫుల్‌ లేడీ పాత్రకు సరిపోయే వారికోసం చిత్ర బృందం బాగానే అన్వేషించింది. మొదట్లో.. తెలుగులో కూడా టబునే నటిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రమ్యకృష్ణ.. అనసూయ.. ఇలియానా చాలా పేర్లు వినిపించాయి. ఆఖర్లో శ్రియ శరణ్‌ ఓకే చెప్పేసిందని, చిత్రీకరణే ఆలస్యమని కూడా అన్నారు. అయితే, చిత్రబృందం వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

మిల్కీబ్యూటీ తమన్నా తమ రీమేక్‌కు ఓకే చెప్పిందని ప్రకటించింది. టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్‌ కనిపించనున్నారని చెప్పింది. నవంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. టుబు పాత్రను తమన్నా ఛాలెంజింగ్‌గా తీసుకుందని చిత్రబృందం పేర్కొంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం సమకూర్చనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని