కరోనా టెస్టుల కోసం 2వేల మినీ క్లినిక్‌లు - Tamil Nadu Launches 2000 Amma Mini-Clinics For corona Testing
close
Published : 14/12/2020 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టెస్టుల కోసం 2వేల మినీ క్లినిక్‌లు

తమిళనాడులో ప్రారంభించిన ముఖ్యమంత్రి పళనిస్వామి


చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడులో సోమవారం ముఖ్యమంత్రి పళనిస్వామి 2వేల మినీ క్లినిక్‌లు ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద వీటికి అమ్మ మినీ క్లినిక్‌లు అని పేరు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వీటన్నింటినీ ఒకే సారి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కొవిడ్‌-19ను ప్రాథమికంగా గుర్తించేందుకు ఈ క్లినిక్‌లలో ఒక వైద్యుడు, నర్సు, ఒక సహాయకుడు ఉంటారని అధికారులు తెలిపారు. కొత్తగా ప్రారంభించిన ఈ కార్యక్రమంతో తమిళనాడు ప్రజల ఆరోగ్య పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని వారు ఆకాంక్షించారు. ఈ క్లినిక్‌లు రోజుకు వందమంది రోగులను పరీక్షించేందుకు వీలుగా తీర్చిదిద్దామన్నారు. పరిస్థితిని బట్టి అదనపు నియామకాలు చేపడతామని తెలిపారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. ఈ క్లినిక్‌లు ప్రారంభించి ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని లిఖించిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పిస్తూ, దాని కట్టడికి కృషి చేస్తున్నారన్నారు. కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అభినందించారని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రధాన ఆరోగ్య కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. గతంలో ఇలాగే ఫీవర్‌ క్లినిక్‌లు ప్రారంభించడం ద్వారా చాలా వరకూ కరోనా కేసులను తగ్గించగలిగామన్నారు. దాని నుంచి ఈ ఆలోచన వచ్చిందని తెలిపారు. పేద ప్రజల నుంచి ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోనేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. కాగా ఆదివారం తమిళనాడులో 1,195 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 7,98,888కు చేరుకోగా, మరణాలు 11,895కు చేరాయి.
మరోవైపు ఐదునెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నటుడు కమల్‌హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎమ్‌ఎన్‌ఎమ్‌) ఆదివారం నుంచి ప్రచారం ప్రారంభించింది. మరోవైపు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాను ప్రారంభించబోయే పార్టీ వివరాలను ఈ నెల 31న ప్రకటించనున్నారు. రజనీ అడుగుపెట్టడంతో తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని