కరోనాతో తమిళనాడు మంత్రి మృతి - Tamilnadu agricultural minister Doraikkannu has passes away
close
Updated : 01/11/2020 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో తమిళనాడు మంత్రి మృతి

తమిళనాడు: కరోనా బారిపడి చికిత్స పొందుతూ తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను(72) కన్నుమూశారు. ఈ నెల 13న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటనే ఆయనను విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కావేరీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి 11.15 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 1948లో తంజావూరు జిల్లా రాజగిరిలో దొరైక్కన్ను జన్మించారు. 3 సార్లు పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దొరైక్కన్నుకు భార్య, నలుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని