హోంవర్కు చేయలేదని మూతి కాల్చిన వైనం - Teacher booked for burning lips of KG girl
close
Updated : 25/11/2020 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోంవర్కు చేయలేదని మూతి కాల్చిన వైనం

 అగ్గిపుల్లతో చిన్నారికి వాత పెట్టిన ఉపాధ్యాయురాలు
 మధ్యప్రదేశ్‌లో దారుణం

బర్వానీ: హోంవర్కు చేయలేదని ఓ ఉపాధ్యాయురాలు నాలుగేళ్ల చిన్నారి పెదాలను కాల్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్వానీ ప్రాంతంలో జరిగింది. సెంధ్వా పోలీసు అధికారిణి భవానీరామ్‌వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా నేపథ్యంలో బడులు మూతబడి ఉండటంతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు హేమా ఒమర్‌ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి వద్దకు ట్యూషన్‌కు పంపుతున్నారు. నవంబరు 19న ఆ చిన్నారి ట్యూషన్‌ ముగించుకొని ఇంటికి చేరుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారి పైపెదవిపై కాల్చిన గుర్తులుండటంతో వారు సంబంధిత ఉపాధ్యాయురాలిని ప్రశ్నించారు. ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. క్రమశిక్షణగా ఉంచటం కోసం తాను చిన్నారిని దండించానే తప్ప కాల్చలేదని ఆమె తెలిపారు. తర్వాత బాలిక తండ్రి ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికను కొట్టి, అగ్గిపుల్లతో కాల్చినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు కరోనా సమయంలో తాను చిన్నారులకు ట్యూషన్‌ చెప్పడానికి నిరాకరించినా వారు బలవంతంగా పంపుతున్నారని ఉపాధ్యాయురాలు తెలిపింది. కరోనా కారణంగా మూతబడి ఉన్న బడులను నవంబరు తర్వాతే తెరుస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని