అది కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు: హర్మన్‌ప్రీత్‌ - Team India Womens captain Harmanpreet Kaur feels T20 cricket league in UAE is a much needed
close
Published : 07/08/2020 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు: హర్మన్‌ప్రీత్‌

టీ20 క్రికెట్‌ లీగ్‌పై టీమ్‌ఇండియా మహిళా సారథి

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా పరిస్థితుల కారణంగా నాలుగు నెలలుగా ఆటకు దూరమైనా మళ్లీ టీ20 క్రికెట్‌ లీగ్‌తో ముందుకు సాగడం శుభపరిణామని టీమ్‌ఇండియా మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్నారు. లాక్‌డౌన్‌తో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడి.. ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. యూఏఈలోని మూడు వేదికల్లో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వరకు ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నవంబర్‌ 1 నుంచి 10 మధ్యలో మహిళల మ్యాచ్‌లు కూడా నిర్వహించాలని నిర్ణయించుకొంది. దాన్ని మిథాలి రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్వాగతించారు. అయితే, అదే సమయంలో వుమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ కూడా ఉండడంతో పలువురు క్రీడాకారిణులు బీసీసీఐపై విమర్శలు చేశారు. దాంతో టీమ్‌ఇండియా కెప్టెన్లు వారి మాటలను తోసిపుచ్చారు. 

భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఈమధ్యే ఆదరణ పెరిగిందని, దాంతో ఐపీఎల్‌ ద్వారా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హర్మన్‌ అన్నారు. ఈ విషయంలో బీసీసీఐ తమకు వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ క్రికెట్‌ను గాడినపెట్టాలంటే ఈ టోర్నీ ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే కొద్ది నెలల క్రితం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరిన విషయంపై స్పందించారు. అది తమ అభిమానులు కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని, ప్రస్తుత పరిస్థితుల్లో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగడం ఎంతో ముఖ్యమని వివరించారు.

గత ఫిబ్రవరి, మార్చిలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన మహిళల పొట్టి ప్రపంచకప్‌లో హర్మన్‌ నేతృత్వంలోనే టీమ్‌ఇండియా చెలరేగిన సంగతి తెలిసిందే. ఫైనల్లోనూ మంచి ప్రదర్శన చేసి కప్పు గెలుస్తుందని ఆశించినా చివరికి ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌కు విశేషమైన స్పందన లభించింది. అటు టీవీ, డిజిటల్‌ వీక్షకుల సంఖ్యతో పాటు మైదానం కూడా పూర్తిగా నిండిపోయింది. తర్వాత టీమ్‌ఇండియా మహిళా జట్టు భారత్‌కు తిరిగి వచ్చాక ఐపీఎల్‌ ఆడాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. ఇప్పుడు ఐపీఎల్‌పై స్పష్టత రావడంతో టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్లు సైతం త్వరలోనే సాధన మొదలుపెట్టే ఆవశ్యకత ఏర్పడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని