రహానె, ఇషాంత్‌, భువి మాయ చేశారు.. - Team India won at Lords on this day in 2014 after 1986 first time
close
Published : 21/07/2020 23:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రహానె, ఇషాంత్‌, భువి మాయ చేశారు..

లార్డ్స్‌లో టీమ్‌ఇండియా చారిత్రక విజయానికి ఆరేళ్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో టీమ్‌ఇండియా చారిత్రక విజయం సాధించి నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. 1986 తర్వాత భారత్‌ అక్కడ టెస్టు మ్యాచ్‌ గెలవడం అదే తొలిసారి. మహేంద్రసింగ్‌  సారథ్యంలోని జట్టు 2014లో సిరీస్‌ ఓడిపోయినా లార్డ్స్‌లో గెలవడం మాత్రం చారిత్రకమనే చెప్పాలి. ఆ మ్యాచ్‌లో భారత్‌ 95 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత అజింక్య రహానె (103) శతకం బాదగా తర్వాత ఇషాంత్‌శర్మ(7) వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్‌ వేదికగా పోస్టు చేసి గుర్తు చేసింది. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేసింది. రహానె(103), భువనేశ్వర్‌ కుమార్‌ (36) ఆదుకున్నారు. బదులుగా ఇంగ్లాండ్‌ 319 పరుగులు చేసింది. గారీ బ్యాలెన్స్‌(110) శతకం బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లో మురళి విజయ్‌(95), రవీంద్ర జడేజా (68), భువనేశ్వర్‌ కుమార్‌(52) చెలరేగడంతో భారత్‌ 342 పరుగులు చేసింది. అనంతరం ఇషాంత్‌ శర్మ విజృంభించి బౌలింగ్‌ చేసి ఏడు వికెట్లు తీశాడు. దాంతో ఇంగ్లాండ్‌ 223 పరుగులకే ఆలౌటైంది. అలా భారత్‌ 95 పరుగుల తేడాతో లార్డ్స్‌లో టెస్టు విజయం సాధించింది. కాగా, భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచినా మిగతా వాటిల్లో తేలిపోయింది. చివరికి ఇంగ్లాండ్‌ 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని