రాజా... అనుభవించు! - Telugu News Anubhavinchu raja Teaser Launched By ram Charan
close
Updated : 24/09/2021 07:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజా... అనుభవించు!

‘‘బంగారం గాడు ఊర్లోని... ఆడి పుంజు బరిలోని ఉండగా... ఇంకొకడు గెలవడం కష్టం’’ అంటున్నాడు బంగారం. మరి ఈ పందెం రాయుడి కథేమిటో తెలియాలంటే ‘అనుభవించు రాజా’ చూడాల్సిందే. రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించారు. కషిష్‌ఖాన్‌ కథానాయిక. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఈ సినిమా  టీజర్‌ని కథానాయకుడు రామ్‌చరణ్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టీజర్‌లో మంచి వినోదం ఉంది. చాలా ఆస్వాదించా. అందరికీ నచ్చుతుంది. చిత్రబృందానికి నా అభినందనలు’’ అన్నారు. ‘‘భీమవరం నేపథ్యంలో సాగే కథ ఇది. రాజ్‌తరుణ్‌ హుషారైన పాత్రలో కనిపిస్తాడు. మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నగేష్‌ బానెల్‌ కెమెరా గ్రామీణ వాతావరణాన్ని చాలా బాగా చూపించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. పోసాని కృష్ణమురళి, ఆడుకాలమ్‌ నరేన్‌, అజయ్‌, సుదర్శన్‌, టెంపర్‌ వంశీ, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్‌ రాజు, ఆరియానా తదితరులు నటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని