ఖాకీ డ్రెస్సు పక్కనెడితే... - Telugu News Bheemla Nayak First Single Out Now
close
Updated : 03/09/2021 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖాకీ డ్రెస్సు పక్కనెడితే...

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు. రానా మరో కథానాయకుడు. గురువారం పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి టైటిల్‌ గీతాన్ని విడుదల చేశారు. ‘‘ఆడాగాదు ఈడాగాదు.. అమీనోళ్ల మేడా గాదు.. గుర్రం నీళ్ల గుట్టా కాడ.. అలుగూ వాగు తాండాలోన’’ అంటూ ఓ సాకీతో పాట ఆసక్తికరంగా మొదలైంది.

‘‘ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్ద గూండా..’’ అంటూ పవన్‌ ఇమేజ్‌ను ప్రతిబింబించేలా గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పాటని ఆవిష్కరించారు. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే 2022 జనవరి12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వచ్చే వేసవికి ‘హరిహర వీరమల్లు’..: పవన్‌ - క్రిష్‌ కలయికలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ను.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘జాతర షురూ’’ అంటూ పవన్‌ కల్యాణ్‌ 28వ చిత్ర ప్రీలుక్‌ విడుదల చేశారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. మైత్రీ మూవీస్‌ నిర్మించనున్న ఈ చిత్రం.. త్వరలో పట్టాలెక్కనుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో పవన్‌ చేయనున్న కొత్త సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను గురువారమే విడుదల చేశారు. ఈ చిత్రాన్ని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని