Bheemla Nayak: అంత ఇష్టం.. భీమ్లా - Telugu News BheemlaNayak Second Single Will Release On Oct 15
close
Updated : 06/10/2021 07:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bheemla Nayak: అంత ఇష్టం.. భీమ్లా

సంక్రాంతి బరిలో నిలిచేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతోంది ‘భీమ్లానాయక్‌’. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. రానా మరో హీరోగా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. సూర్య దేవర నాగవంశి  నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిపై రూపొందిన ‘‘అంత ఇష్టం’’ అనే గీతాన్ని.. దసరా సందర్భంగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు     మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ఓ కొత్త లుక్‌ను పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో పవన్‌.. నిత్యల జోడీ చూడముచ్చటగా కనిపించింది. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌.. భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. డేనియల్‌ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా సంయుక్త మేనన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నారు.





Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని