గబ్బర్‌ సింగ్‌తో డేనీ పోరు - Telugu News Blitz of Daniel Sekhar Out Now
close
Updated : 21/09/2021 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గబ్బర్‌ సింగ్‌తో డేనీ పోరు

‘భీమ్లా నాయక్‌’ చిత్రం కోసం డేనియల్‌ శేఖర్‌గా కొత్త అవతారమెత్తారు నటుడు రానా. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన మరో హీరోగా నటిస్తున్నారు. సాగర్‌.కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమాలోని రానా పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ టీజర్‌ను బట్టి సినిమాలో రానా పాత్ర పవన్‌ పాత్రకు దీటుగా ఉన్నట్లు అర్థమవుతోంది. ‘‘నీ మొగుడు గబ్బర్‌ సింగ్‌ అంట?స్టేషన్‌లో టాక్‌ నడుస్తోంది. నేనెవరో తెలుసా ధర్మేంద్ర.. హీరో.. హీరో..’’, ‘డేనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌ వన్‌’’ అంటూ ప్రచార చిత్రంలో డేనియల్‌ శేఖర్‌గా రానా పలికిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.‘
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని