ఓ ఓబులమ్మ.. - Telugu News First Song From Kondapolam out now
close
Updated : 28/08/2021 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ ఓబులమ్మ..

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొండపొలం’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు. ఈ సినిమా అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘గింజ గింజ మీద.. బుసక బుసక బుసక తీసి తియ్యంగ బత్తెమై పోయే.. బొట్టే కట్టి చేతబట్టిన చేతిలోకి చేరాలని.. ఓ ఓబులమ్మ..’’ అంటూ రాయలసీమ యాసలో సాగుతున్న ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చడమే కాక స్వయంగా సాహిత్యం అందించారు. సత్య యామిని, పివిఎస్‌ఎస్‌ రోహిత్‌ సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటలో వైష్ణవ్‌, రకుల్‌ల జోడీ చూడముచ్చటగా కనిపించింది. జ్ఞానశేఖర్‌ విజువల్స్‌ ఈ గీతానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
‘‘అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్‌ చిత్రమిది. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కించారు. రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా కనిపిస్తుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి కూర్పు: శ్రవణ్‌ కటికనేని, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని