Ghani: ‘గని’ పంచ్‌ - Telugu News Ghani First Punch Out Now
close
Updated : 07/10/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ghani: ‘గని’ పంచ్‌

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘గని’ డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటనని విడుదల చేయడంతోపాటు, ‘గని’ ఫస్ట్‌ పంచ్‌ పేరిట ఓ వీడియోని విడుదల చేసింది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో... సిద్ధు ముద్ద, అల్లు బాబీ  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌కి జోడీగా  సయీ మంజ్రేకర్‌ నటించింది. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘విభిన్నమైన    సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే కథానాయకుడు వరుణ్‌తేజ్‌. బాక్సింగ్‌ నేపథ్యంతో కూడిన ఈ కథ చెప్పగానే ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. విదేశాలకి వెళ్లి ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకి పనిచేసిన లార్నెల్‌ స్టోవల్‌, వ్లాడ్‌ రింబర్గ్‌ పోరాట ఘట్టాల్ని డిజైన్‌ చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుందీ చిత్రం’’ అన్నారు. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని