విలన్లతో ఓ ఆటాడి.. - Telugu News Goa Schedule Of Sarkaruvaripata wraped Up
close
Updated : 26/08/2021 08:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విలన్లతో ఓ ఆటాడి..

పులి...కుందేలు కథ చెబుతూ ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్‌తో మహేష్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అదే తరహాలో మహేష్‌ మరోసారి విలన్లతో ఓ ఆట ఆడుకున్నాడు. మరి ఆ ఆట ఎలా సాగిందో తెలియాలంటే మాత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. కీర్తిసురేష్‌ కథానాయిక. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మాతలు. గోవాలో ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్‌లో... రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో ఆ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. దాంతో గోవా షెడ్యూల్‌ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని