అర్ధరాత్రి దొంగలు పడ్డాక - Telugu News House Arrest Pre Release Evenet
close
Updated : 26/08/2021 08:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్ధరాత్రి దొంగలు పడ్డాక

‘‘నేటితరం పిల్లలు ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారెలా ప్రతిస్పందిస్తున్నారనే విషయాన్ని ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం’’ అన్నారు శేఖర్‌ రెడ్డి ఎర్రా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్‌ అరెస్ట్‌’. శ్రీనివాస్‌రెడ్డి, సప్తగిరి, అదుర్స్‌ రఘు, రవిప్రకాశ్‌, రవిబాబు, తాగుబోతు రమేష్‌, ఫ్రస్ట్రేటెడ్‌ సునయన, కౌశిక్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 27న విడుదల కానుంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ప్రశాంత్‌ వర్మ, రామ్‌ప్రసాద్‌, చంద్రమహేశ్‌, అశోక్‌రెడ్డి, ఎన్‌.శంకర్‌, చందురెడ్డి తదితరులు పాల్గొని బిగ్‌ టికెట్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు పడినప్పుడు ఆ ఇంట్లోని పిల్లలు వారినెలా ఆడుకున్నారనేదే ఈ సినిమా’’ అన్నారు. కార్యక్రమంలో అనూప్‌రూబెన్స్‌ తదితరులు పాల్గొన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని