నవ్వించే మొనగాళ్లు - Telugu News Mugguru Monagallu Pre Release
close
Updated : 06/08/2021 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వించే మొనగాళ్లు

శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్‌శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. అభిలాష్‌రెడ్డి దర్శకత్వం వహించారు. పి.అచ్యుత రామారావు నిర్మాత. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి,  దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌ వీడియో ద్వారా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. నటుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘కరోనా సమయంలో చిత్రీకరణలు లేవని అందరూ బాధపడుతుంటే నిర్మాత జాగ్రత్తగా సినిమాని తీసి మా అందరికీ డబ్బులిచ్చారు. అందరికీ వినోదం పంచే ఓ మంచి ప్రయత్నం ఇది’’ అన్నారు. ‘‘కడుపుబ్బా నవ్వించే చిత్రమిది, సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతల’’న్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బి.వి.ఎస్‌.రవి, సోహైల్‌, అరియానా, గరుడ వేగ అంజి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని