‘బంగార్రాజు’ సందడి షురూ - Telugu News Nagarjuna And naga Chaitanya Starer Bangarraju Shoots Starts From Friday
close
Updated : 21/08/2021 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బంగార్రాజు’ సందడి షురూ

‘బంగార్రాజు’ని పట్టాలెక్కించారు నాగార్జున. 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి ప్రీక్వెల్‌గా రూపొందుతున చిత్రమిది.కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూకి జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. ఈ సినిమాని శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని