నితిన్‌ కోసం నిధి - Telugu News Nidhi Agarwal Plays Lead in Nithiins Macherla Niyojakavargam
close
Updated : 17/09/2021 07:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌ కోసం నిధి

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కింది నటి నిధి అగర్వాల్‌. ఆ చిత్రమిచ్చిన విజయోత్సాహంతో ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న ఆమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌ అందిపుచ్చుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నితిన్‌ కథానాయకుడిగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కృతిశెట్టి నాయిక. ఇప్పుడీ సినిమా కోసం మరో నాయికగా నిధిని ఖరారు చేసినట్లు సమాచారం. విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మహతి స్వరసాగర్‌ స్వరాలందిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని