ఓటీటీలో ‘మాస్ట్రో’ - Telugu News Nithiin Starer Maestro Release In OTT
close
Updated : 21/08/2021 08:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో ‘మాస్ట్రో’

నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్ట్రో’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. హిందీలో విజయవంతమైన ‘అంధాధూన్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. నభా నటేష్‌ కథానాయిక. తమన్నా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది. ఈనెల 23న సాయంత్రం 5గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నితిన్‌, నభా, తమన్నా కలిసి ఉన్న ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. నితిన్‌ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో ప్రకటిస్తామ’’ని నిర్మాతలు ప్రకటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని