Pawankalyan: పవన్‌ని టార్గెట్‌ చేయాల్సిన అవసరం మాకు లేదు:  కొడాలి నాని - Telugu News Our Government Is Not Targeting Pawan Kalyan Says Kodali Nani
close
Updated : 04/10/2021 06:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawankalyan: పవన్‌ని టార్గెట్‌ చేయాల్సిన అవసరం మాకు లేదు:  కొడాలి నాని

‘‘పవన్‌ కల్యాణ్‌ చిత్రం హిట్టయినా.. ప్లాపైనా మాకు ఏమైనా లాభమా? ఆయన్ని టార్గెట్‌ చేయాల్సిన అవసరం జగన్మోహన్‌ రెడ్డికి లేద’’న్నారు మంత్రి కొడాలి నాని. ఒక సినిమాను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని, మొత్తం పరిశ్రమను దృష్టిలో పెట్టుకొనే ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. ఆదివారం ‘ఆటో రజిని’ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. వేడుక అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వేల మందికి జీవనోపాధి కల్పించేది సినీ పరిశ్రమ. అంతేకానీ, నలుగురు హీరోలు.. నలుగురు దర్శక, నిర్మాతలకు సంబంధించినది కాదు. సినిమానే లోకంగా బతికే ప్రతి డిస్టిబ్యూటర్‌కి, నిర్మాతకు న్యాయం జరగాలి. అదే విధంగా ప్రజలకూ అన్యాయం జరగకూడదు. అందరూ బతకాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. అందుకే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, న్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. అందరినీ దృష్టిలో పెట్టుకొని సినీ నిర్మాతలతో మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. నిర్మాతలు మా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. వాటిని మేమెంత వరకు చేయగలమో చూసుకుని మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. వాటిపై చర్చించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సామరస్యమైన వాతావరణంలో సమస్యను పరిష్కరిస్తాం’’ అన్నారు కొడాలి నాని.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని