మొగులయ్యకి రూ. 2లక్షల సాయం - Telugu News Pawankalyan Announces Financial Aid To Mogulaiah
close
Updated : 05/09/2021 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొగులయ్యకి రూ. 2లక్షల సాయం

12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేస్తున్న అరుదైన జానపద కళాకారుడు మొగులయ్యకి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. ఇటీవలే మొగులయ్య ‘భీమ్లా నాయక్‌’ చిత్రంలోని పరిచయ గీతానికి సాకీ ఆలపించడంతోపాటు... ఆ పాటకి తన కిన్నెర స్వరాల్ని అద్దారు. దీనికి చక్కటి స్పందన లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతానికి చెందిన మొగులయ్యకి పవన్‌కల్యాణ్‌ తన ట్రస్ట్‌ ‘పవన్‌ కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌’ నుంచి రూ.2 లక్షలు అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు తన కార్యాలయ సిబ్బందికి సూచనలు చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును అందజేస్తారని జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని