‘భవదీయుడు భగత్‌సింగ్‌’గా.. - Telugu News Pawankalyan and Harish Shankar New Movie Titled As Bhavadeeyudu Bhagat singh
close
Updated : 10/09/2021 07:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భవదీయుడు భగత్‌సింగ్‌’గా..

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా  ప్రకటించింది. దీంతో పాటు ‘‘పవర్‌ఫుల్‌ టైటిల్‌ ఫర్‌ పవర్‌ఫుల్‌ కటౌట్‌’’ అంటూ పవన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌నూ విడుదల చేశారు. పవన్‌ ఇండియా గేట్‌ ముందు హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై స్టైలిష్‌గా కూర్చుని కనిపించారు. ఓ చేతిలో టీ గ్లాస్‌.. మరో చేతిలో స్పీకర్‌ పట్టుకుని ఉన్నారు. ప్రచార చిత్రంపై ‘ఇట్స్‌ నాట్‌ జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అని పేర్కొనడాన్ని బట్టి.. ఈసారి వినోదంతో పాటు ఓ చక్కటి సందేశాన్ని అందించనున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కూర్పు: చోటా కె ప్రసాద్‌, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, ఛాయాగ్రహణం: అయనాంక బోస్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని